చీరాల మండలం జాండ్రపేట బీవి అండ్ బి ఎన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశంలో ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొన్నారు. సందర్భంగా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే మాలకొండయ్య భోజనం చేశారు. పాఠశాలలో అందుతున్న వసతులు, ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై విద్యార్థుల నుంచి అభిప్రాయాలను ఎమ్మెల్యే నేరుగా తెలుసుకున్నారు.