చీరాల రూరల్ మండలం దేవాంగపురి శంకరయ్య మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి పాఠశాల యాజమాన్య కమిటీ నూతన కమిటీ ఎన్నిక మంగళవారం జరిగింది. ప్రధానోపాధ్యాయురాలు బోడావుల సుభాషిణి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పింజల శైలజ ఎస్ఎంసీ చైర్మన్గా, బుద్ధి శంకర్ బాబు వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మొత్తం 15 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. వై. నాగమణి–ఏఎన్ఎం, పి. ప్రసన్న కుమారి–ఉపాధ్యాయురాలు తదితరులు కమిటీలో భాగమయ్యారు.