బాలికలకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించిన అధికారులు

ఇంకొల్లు ప్రాజెక్ట్ పరిధిలోని ఇంకొల్లు మండలం Zphs స్కూల్లో బాలబాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోక్సో యాక్ట్, బాల్య వివాహ నిషేధ చట్టం, విద్య హక్కు చట్టం గురించి వివరించారు. బడి మానివేతను ఆపి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే నష్టాలను CDPO సులోచన రాణి పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో HM, సూపర్వైజర్ సుమలత, PET మేడమ్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్