స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీగా శ్రావణి

బాపట్ల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీగా జె. శ్రావణి 2026-27 విద్యా సంవత్సరానికి ఎంపికయ్యారు. ఈమె వేటపాలెం జడ్పీ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం డి. సరోజినీ శనివారం ఆమెను ఘనంగా సత్కరించి అభినందించారు. తమ పాఠశాలకు చెందిన పిడి యస్జిఎఫ్ సెక్రెటరీగా ఎంపిక కావడం పట్ల టీచర్స్, స్టూడెంట్స్ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕