యూట్యూబ్ ఛానెల్‌పై వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

బాపట్ల, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యపై యూట్యూబ్ ఛానెల్‌లో అసత్య వార్తలు ప్రసారం చేసినందుకు చర్యలు తీసుకోవాలని మండల టీడీపీ శ్రేణులు వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశాయి. ఆ వార్తలకు మూలం ఎవరో ప్రశ్నిస్తూ ఎమ్మెల్యేకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనియెడల తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వార్తలు ప్రసారం చేసే ముందు వాస్తవాలను పరిశీలించాలని టీవీ యాజమాన్యాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్