భూ వివాదంలో టిడిపి నేతల దాడి: మహిళ సహా ఇద్దరికి గాయాలు

బాపట్ల, చీరాల ప్రాంతంలోని వేటపాలెం మండలం అక్కయ్యపాలెం గ్రామంలో భూ వివాదం కారణంగా సోమవారం సాయంత్రం జరిగిన దాడిలో జంగిలి ఉమాభారతి, గవిని శివరామప్రసాద్ గాయపడ్డారు. బాధితులు స్థానిక టిడిపి నేతలు కొల్లూరి సీతారామయ్య, గొర్ల రాముడు తదితరులపై దాడి చేశారని ఆరోపించారు. స్థానికులు బాధితులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అవుట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్