దేవాంగపురిలో టీడీపీ విస్తృత సమావేశం

బాపట్ల జిల్లా, చీరాల రూరల్ మండలం, దేవాంగపురిలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురువారం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధి, పార్టీ బలోపేతం ప్రజా సమస్యల పరిష్కారంపై విస్తృతంగా చర్చించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సిద్ది బుచ్చేస్వర రావు, పృథ్వి లలిత మోహన్, పృథ్వి వెంకటేశ్వర్లు, సజ్జా రేణుక తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕