శనివారం, పర్చూరులోని గురుకుల విద్యార్థులను పదో తరగతి పరీక్షలకు తరలిస్తున్న చీరాల డిపో ఆర్టీసీ బస్సు ఉప్పుటూరు ఫ్లైఓవర్ వద్ద నిలిచిపోయింది. జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు పనుల కారణంగా ఒకే మార్గంలో రాకపోకలు సాగుతుండటంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బస్సు ఆగిపోయిన సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు.