రైలులో చోరీ చేసిన నిందితుడు అరెస్ట్

చీరాల సమీపంలో తిరుచానూరు–నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న పల్లపు సాయిప్రియ అనే మహిళ హ్యాండ్‌బ్యాగ్‌ను దొంగిలించిన పెరికల సందీప్ అనే నిందితుడిని జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 25న జరిగిన ఈ ఘటనలో, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 8 గ్రాముల బంగారు గొలుసు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.

సంబంధిత పోస్ట్