వడదెబ్బతో బైక్‌పై నుంచి పడి యువతి మృతి

మంగళగిరి నుంచి చీరాల వాడరేవుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శ్రీనిక (23) వడదెబ్బకు గురై మృతి చెందింది. ఆమె మరిది అజయ్ కుమార్ తో కలిసి ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో ఈ విషాదం చోటుచేసుకుంది. శ్రీనిక బైక్ పై నుంచి పడిపోతుండగా, వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనిక తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించింది. అజయ్ కుమార్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం చీరాల వాడరేవు సమీపంలో జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్