గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని భారత్ పేట 7వ లైనులోని ఓ వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్, ఎస్బీ పోలీసులు ఆదివారం దాడి చేశారు. నలుగురు మహిళలు, ఒక విటూని అదుపులోకి తీసుకొన్నారు. ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గోరంట్లకు చెందిన సాయిలక్ష్మి అలియాస్ అంజలి యువతుల ఫొటోలను వాట్సప్ ద్వారా విటులకు పంపిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.