గుంటూరులోని నల్లచెరువు మోడల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కవాచి సుధీర్ బాబు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గుంటూరు నగర మాజీ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు నోట్‌బుక్స్ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.