గుంటూరు: జీజీహెచ్ వద్ద ఆటో డ్రైవర్ల అరాచకాలు

గుంటూరు జీజీహెచ్ అవుట్‌పేషెంట్ విభాగం వద్ద ఆటో డ్రైవర్ల అరాచకాలు మితిమీరుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారు ఇష్టానుసారంగా ఆటోలను పార్క్ చేయడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్ అవుతోంది. ఫలితంగా రోగులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఆటోలు అక్కడి నుంచి తిప్పేయడానికి డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్