గుంటూరు D12 సెక్షన్ పరిధిలోని లాలుపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు DYEE కేవీ సుబ్బారావు తెలిపారు. కృష్ణబాబుకాలనీ, జోసఫ్ కాలనీ, వీఐపీ రోడ్డు, లాలుపురంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. స్కాడా వర్క్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.