గుంటూరు నగరవాసులకు గమనిక. హెడ్ వాటర్ వర్క్స్‌లో మరమ్మతులు జరుగుతున్నందున, వచ్చే సోమవారం సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని ఈ సంస్థ నగర కమిషనర్ శ్రీనివాసులు తెలియజేశారు. నీరు సరఫరా నిలిచిపోయే ప్రాంతాల్లో నెహ్రు నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, ఎల్‌ఆర్, ఐపీడీ కాలనీ, స్తంభాల గరువు, అడవితక్కెళ్లపాడు, రాజీవ్ గాంధీ నగర్, కోర్ట్ కాంపౌండ్ ఉన్నాయి. ప్రజలు ఇది గమనించి, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కమిషనర్. మరమ్మతులు చేయబడ్డ వెంటనే నీటి సరఫరా చేస్తామన్నారు.