గుంటూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సోమవారం, గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ భీమనేని వందనా దేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలోని దురాచారాలపై తన రచనలతో చైతన్యం కలిగించిన గురజాడ తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయారని వందనా దేవి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప గ్రంథపాలకురాలు కందుల ఝాన్సీ లక్ష్మి, గ్రంథాలయ అధికారి వేముల విజయ్ కుమార్, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.