పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 820 కోట్లు కేటాయించింది. ఇందులో సింహభాగం గుంటూరు జిల్లాకే రూ. 527 కోట్లు మంజూరు కావడం విశేషం. ఈ నిధులతో గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి, తెనాలి, పొన్నూరు మున్సిపాలిటీలను అభివృద్ధి చేయనున్నారు. అలాగే విజయవాడకు రూ. 140 కోట్లు, బాపట్ల జిల్లాకు రూ. 90 కోట్లు, కృష్ణా జిల్లాకు రూ. 63 కోట్లను రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల నిర్మాణానికి కేటాయించారు.