గుర్రం జాషువా జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరారు. జాషువా 131వ జయంతి సందర్భంగా గుంటూరులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరు లేదా పల్నాడు జిల్లాకు జాషువా పేరు పెట్టాలని, జాషువా కళాపీఠాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.