అఖిల భారత విద్యార్థి సమాఖ్య గుంటూరు జిల్లా కార్యదర్శి బందెల నాసర్ జీ ని జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తిరుపతి నగరంలో 28, 29వ తేదీల్లో జాతీయ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ఆయనను నియమించారు. గుంటూరు నగర స్థాయి నుంచి, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయికి వెళ్ళటంతో గుంటూరు నగర నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.