మంగళగిరి మండలం కాజాకు చెందిన శశి, అనిల్ కుమార్‌ను ఆదివారం పెదకాకాని పోలీసులు అరెస్టు చేశారు. వీరు విశాఖపట్నంలో అర్జున్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి మంగళగిరి, ఉప్పలపాడు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని సీఐ నారాయణస్వామి తెలిపారు. అరెస్టు చేసిన ఇరువురిని జైలుకు తరలించామని పోలీసులు వెల్లడించారు.