యడ్లపాడు మండలంలో బుధవారం సాయంత్రం పిడుగు పడి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు స్ప్రుహ కోల్పొయి ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కారుచోల గ్రామానికి చెందిన 15 మంది మహిళలు మిర్చికోతలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో సాయంత్రం సుమారు 5 గంటలకు ఉరుములు, మెరుపులు రావడంతో పనులు నిలుపుదల చేసి ఇళ్లకు వెళ్లాలని పొలం నుండి రోడ్డుపై ఉన్న ఆటో వద్దకు వస్తున్న సమయంలో పిడుగు పడి ఆమె మృతి చెందింది.