పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినిని ఢీకొన్న కారు.. తీవ్ర గాయాలు

మంగళవారం బల్లికురవ-అద్దంకి రహదారిలోని వాటర్ ప్లాంట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటుపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని కేరోలిన్ తీవ్రంగా గాయపడింది. కేరోలిన్ సైకిల్‌పై బల్లికురవ ఉన్నత పాఠశాలకు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. గాయపడిన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పాఠశాల హెచ్‌ఎం హనుమంతరావు ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్