నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా దారుణ హత్య

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోగల పలకలూరు రోడ్ లోని నారాయణ మహిళా జూనియర్ కాలేజ్ సమీపంలో ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై శనివారం నాడు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మృతురాలికి సుమారు 50 సంవత్సరాలు ఉంటాయని అన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలను సేకరించి పనిలో పడింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్