గుంటూరు, పెదకాకాని వద్ద శుక్రవారం తెల్లవారుజామున నేషనల్ హైవే 16పై సర్వీస్ రోడ్డులోకి ఒక కారు ప్రమాదవశాత్తు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. హైవే సిబ్బంది వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. తెలంగాణకు చెందిన కారుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.