గుంటూరు ఎకో పార్కులో నాటిన వెయ్యి మొక్కల సంరక్షణ బాధ్యతను చేయూత ఫౌండేషన్ చేపట్టింది. మంగళవారం, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో మొక్కలకు పాదులు చేయడం, కర్రలు ఏర్పాటు చేయడం, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చేయూత ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రటరీ ఎస్. మంజునాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మొక్కలను నాటి వదిలేయకుండా వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు.