చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి

ఈ నెల 2న పొన్నూరు రోడ్డులోని లాలాజాన్ భాష పార్కు వద్ద అపస్మారక స్థితిలో ఉన్న సుమారు 60 ఏళ్ల వృద్ధుడిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు శనివారం లాలాపేట పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచామని, మృతుడి వివరాలు తెలిసిన వారు లాలాపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕