కూతురిని ఆసుపత్రికి తీసుకెళ్తూ తండ్రి మృతి

కూతురిని ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకెళ్తున్న తండ్రి మార్గమధ్యంలో గుండెనొప్పితో మృతి చెందిన విషాద ఘటన కొండమోడు వీరమ్మకాలనీ సమీపంలో బుధవారం జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న కూతురిని తొలుత బ్రాహ్మణపల్లి మెడికల్ కాలేజీకి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు నరసరావుపేట ఆసుపత్రికి తరలించమని సూచించారు. దీంతో ఆటోలో తరలిస్తుండగా, వెనుక బైక్‌పై వస్తున్న తండ్రి సైదులు టెన్షన్‌తో గుండెనొప్పితో రోడ్డుపైనే కుప్పకూలి మృతి చెందారు.

సంబంధిత పోస్ట్