బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి ఆర్థిక సాయం అందజేత

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన అండర్-13 క్రీడాకారుడు వెల్దుర్తి దేవాదిత్యకు జనచైతన్య గ్రూపు అధినేత మాదల చైతన్య రూ. 50 వేల ఆర్థిక సాయం సోమవారం అందించారు. 53వ గుంటూరు జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి దేవాదిత్య రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. నవంబర్ 14న తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని మాదల చైతన్య ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్

✕
✕