గుంటూరు: కూతురి పట్ల అసభ్య ప్రవర్తన.. తండ్రిపై దాడి

కూతురిని అసభ్యకరంగా దూషించి ఆమె తండ్రిపై దాడి చేసిన ముగ్గురు యువకులపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో గురువారం కేసు నమోదైంది. పోలీసుల వివరాలు విద్యానగర్ 1వ లైన్ శివారు మార్గం ద్వారా ఒకవ్యక్తి తమ కుమార్తె వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో మద్యం సేవించిన యువకులు అతని కుమార్తెను దూషించారు. అనంతరం ఆమె తండ్రి ఆ యువకులను మందలించడంతో మద్యం సీసాతో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్