గుంటూరు టౌన్-4 సబ్ డివిజన్ పరిధిలో లైన్ల మరమ్మతులు చేస్తున్నందున విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ చెల్లి ఖాన్ తెలిపారు. దీనివల్ల మంగళవారం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు సీతారామనగర్ తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ దీన్ని గమనించి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటనలో కోరారు.