గుంటూరు: మద్యం దుకాణాల ఏర్పాటును ఆపండి

పాతగుంటూరు మణిహోటల్ సెంటర్ లో నూతన మద్యం దుకాణాల ఏర్పాటును ఆపివేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రొగ్రెసివ్ రిడ్రెస్సల్ సిస్టమ్ కార్యక్రమంలో స్థానికులు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. మద్యం దుకాణాలు పెడితే మసీద్, చర్చ్ కు వెళ్లే వారితో పాటూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడతారని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్