పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు కొంతమేర తగ్గించి ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు గురువారం నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో కంది పప్పు రూ. 160, స్టీమ్ రైస్ (బీపీటీ రకం), కిలో రూ. 49, రైస్ కిలో రూ. 48 చొప్పున అందిస్తామన్నారు.