అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణికి మరో షాక్ తగిలింది. తాజాగా ఆయనపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గుంటూరు సీఐడీ పోలీసులు మంగళవారం ఉదయం పీటీ వారెంట్‌పై కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ చేసి, కొద్దిసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు. కోర్టు రిమాండ్ లో విధించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.