గుంటూరు–చిలకలూరిపేట రోడ్డులోని మిర్చి యార్డు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్చి యార్డులో పనిచేసే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించగా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.