అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై చర్యలుతీసుకోండి

గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాషకి, ముస్లింసేన రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సుభాని, న్యాయవాదులు కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. అధిక ఫీజులు వసూలు చేయడం, పాఠశాలల్లోనే పుస్తకాలు, యూనిఫాం కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం, ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠశాలలు నిర్వహించడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్