గుంటూరు వెస్ట్ తహశీల్దారుగా వెంకటేశ్వరరావు బాధ్యతలు

గుంటూరు వెస్ట్ తహశీల్దార్ గా బాధ్యతలు కె. వెంకటేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన ప్రకాశం జిల్లా దర్శిలో పనిచేస్తూ ఎన్నికల సమయంలో మంగళగిరికి బదిలీపై వచ్చారు. అనంతరం గుంటూరు వెస్ట్ కు నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది ఆయన ను కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్