ఆర్టీసీ కండక్టర్‌పై మహిళలు దాడి

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మేరికపూడిలో మంగళవారం ఆర్టీసీ కండక్టర్ పూర్ణచంద్రపై సుమారు 50 మంది మహిళలు దాడి చేశారు. గుంటూరు బస్టాండ్‌లో కదులుతున్న బస్సు ఎక్కవద్దని ఒక ప్రయాణికుడిని వారించడమే ఈ దాడికి కారణమని కండక్టర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగ్రహించిన ఆ వ్యక్తి తన బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు మేరికపూడి వద్ద బస్సును అడ్డగించి కండక్టర్‌పై దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్ణచంద్ర ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕