గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో దాచేపల్లి టీడీపీ కార్యాలయంలో బుధవారం ఇరికేపల్లి గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 20 కుటుంబాలు టీడీపీలో చేరారు. వైసీపీ విధానాల పట్ల విసుగు చెంది, కూటమి ప్రభుత్వం ఊరూరా చేస్తున్న అభివృద్ధి నచ్చి టీడీపీలో చేరినట్లు నాయకులు తెలిపారు. టీడీపీ పటిష్టతకు కృషి చేయవలసిందిగా యరపతినేని కోరారు.