అపార్టుమెంట్ కు రంగులు వేస్తూ జ్వాలా తాడు తెగి పెయింటర్ మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని దావత్ రెస్టారెంట్ సమీపంలోని అపార్టుమెంట్ కు పెయింట్ వేసే పనికి భవన నిర్మాణ కార్మికుడు కరిముల్లా (36)వెళ్లాడు. జ్వాలా తాడుపై కూర్చొని పెయింటింగ్ పనిచేస్తుండగా తాడు తెగిపోవడంతో కరీముల్లా కిందపడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.