ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కేబుల్ టీవీ టెక్నీషియన్ మృతి చెందిన సంఘటన దాచేపల్లి మండల పరిధిలోని బట్టువారిపల్లెలో గురువారం జరిగింది. దాచేపల్లి గ్రామానికి చెందిన జాల నాగేశ్వరరావు (42) కేబుల్ టీవీలో ఫైబర్ జాయింట్లు వేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. బట్టువారిపల్లెలో కేబుల్ వైర్లు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.