బస్సు ఆపలేదని డ్రైవర్, కండక్టర్ పై కోడిగుడ్లు, కర్రలతో దాడి

పల్నాడు జిల్లా గురజాలలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ పై దాడి జరిగింది. మాచర్ల వెళ్తున్న బస్సును మాడుగుల అడ్డరోడ్డు వద్ద ఆపాలని ఓ మహిళ కోరగా, డ్రైవర్ ముందుకెళ్లి ఆపాడు. ఆతరవాత మాచర్ల వెళ్లి వస్తుండగా మహిళ, ఆమె కుటుంబసభ్యులు బస్సును అడ్డుకుని డ్యూటీ మారిన కండక్టర్, డ్రైవర్ పై కోడిగుడ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనపై గురజాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕