రిమాండ్ లో ఉన్న ఖైదీ పరారైన ఘటన శుక్రవారం జరిగింది. దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో నిందితుడిగా. గురజాల సబ్ జైలులో షేక్ జిలానీ రిమాండ్ లో ఉన్నాడు. దాచేపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది మధ్యాహ్నం జైలు నుంచి జిలానీని గురజాల కోర్టుకు వాయిదా నిమిత్తం తీసుకెళ్లారు. ఇదే అదునుగా నిందితుడు పోలీసు సిబ్బంది కళ్లుగప్పి కోర్టు వద్ద నుంచి పరారయ్యాడు.