గురజాల తహసిల్దార్ గా నగేష్ బాధ్యతలు స్వీకరణ

గురజాల తహసీల్దార్ గా కె. నగేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన గురజాలకు వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ తహసీల్దార్ గా బాధ్యతలు నిర్వహించిన అశోక్ కుమార్ రెడ్డి బదిలీ అయ్యారు. ఈయన గతంలో నకరికల్లు, సత్తెనపల్లి, రాజుపాలెం మండల తహసీల్దార్ గా విధులు నిర్వర్తించారు. గతంలో నాలుగు నెలలు పాటు గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పరిపాలనాధికారిగా విధులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్