హైవేపై లారీల ఢీ.. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌కు గాయాలు

పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలో అద్దంకి–నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై శనివారం రాత్రి కురిసిన వర్షంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ క్యాబిన్ దెబ్బతినడంతో డ్రైవర్ లోపల ఇరుక్కుపోయాడు. పోలీసులు, స్థానికుల సహాయంతో డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసి గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్