మాచవరంలో బట్టల వ్యాపారి కొత్త శ్రీనివాసరావు ఇంట్లో జరిగిన భారీ చోరీ ఘటనలో సుమారు 70 తులాల బంగారం, రూ. 15 వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు వెల్లడించారు. తాను, తన భార్య హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో ఇంట్లో బంగారం కనిపించడం లేదని చిన్న కుమార్తె ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. చోరీకి గురైన బంగారం విలువ దాదాపు రూ. కోటి ఉంటుందని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.