వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కు కోర్టు రిమాండ్ పొడిగించింది. అనిల్ కు ఫిరంగిపురం పోలీసులు నరసరావుపేట కోర్టులో బుధవారం హాజరుపరచగా కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి లోకేశ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో అనిల్ పై కేసు నమోదైంది. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో అతను రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.