పిడుగురాళ్ల: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై మానవహారం

పిడుగురాళ్ల టౌన్‌లో సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మానవహారం నిర్వహించారు. మండల సెక్రటరీ తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆయన తప్పుబట్టారు. జీవో 36 అమలుతో వేతనాలు, పెన్షన్, బెనిఫిట్లు కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చర్చలకు రాకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్