పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక తిరిగి మంగళవారం కూడా వాయిదా పడినట్లు గురజాల ఆర్డీవో మురళీకృష్ణ తెలిపారు. ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావడంతో వాయిదా వేయడం జరిగిందని విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. తదుపరి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతుందని ఆర్డిఓ మురళీకృష్ణ విలేకరులకు తెలిపారు.