పిడుగురాళ్ల: మా కౌన్సిలర్లను పోలీసులే కిడ్నాప్ చేయించారు

పిడుగురాళ్లలో 15 మంది వరకు కౌన్సిలర్లను పిడుగురాళ్ల సీఐ ఆధ్వర్యంలోనే కిడ్నాప్ చేశారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పిడుగురాళ్ల వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. పోలీసులు వైసీపీ కౌన్సిలర్ల ఇంటికి వెళ్లి మీపై కేసులు ఉన్నాయని మిమ్మల్ని సీఐ రమ్మంటున్నారని అర్ధరాత్రి సమయంలో తీసుకువెళ్లారని వారిని వెంటనే విడుదల చేయకపోతే ఆందోళన చేస్తామని కాసు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్