పిడుగురాళ్ల: పోలీసులు కిడ్నాప్ చేసి భయపెడుతున్నారు: కాసు మహేష్

పోలీసులే కిడ్నాప్ చేసి తమ పార్టీ కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి శుక్రవారం అన్నారు. పిడుగురాళ్ల వైస్ ఛైర్మన్ ఎన్నికను ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్య యుతంగా నిర్వహించాలన్నారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, పిడుగురాళ్ల వదిలి వెళ్లిపోయిన కుటుంబ సభ్యులను స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారన్నారు. టీడీపీ నీచ రాజకీయాలు చేస్తుందని మహేష్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్